నంద్యాలలో జిల్లా చదరంగం జట్ల ఎంపిక పోటీలు
NANDYAL June19 :- నంద్యాల జిల్లా చెస్ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో అమెచ్యూర్ నంద్యాల జిల్లా చదరంగం జట్ల ఎంపిక పోటీలు నిర్వహించారు.నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని పోటీలు ప్రారంభించారు.ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ చదరంగం క్రీడ వలన బాలలలో మానసిక వికాసం కలుగుతుందని,చదరంగం క్రీడ విద్యార్థులలో గెలుపు ఓటములను స్వీకరించే మనస్తత్వం, ఓటమి చెందాక తిరిగి గెలవాలనే పట్టుదల పెంచే క్రీడా అన్నారు.డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ చదరంగం మేధో శక్తిని,ఏకాగ్రతను ఇనుమడింప చేస్తుందని అన్నారు. తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలు విద్యార్థులను క్రీడలలో ప్రోత్సహించాలని కోరారు. నిరంతర సాధన ద్వారా చదరంగంలో మెలకువలను, నైపుణ్యాన్ని పెంచుకోవాలని కోరారు.నంద్యాల జిల్లా చెస్ సంఘం ప్రధాన కార్యదర్శి రామ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఈ పోటీలలో విజేతలుగా నిలిచిన వారు విజయనగరంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.డాక్టర్ రామకృష్ణారెడ్డి,డాక్టర్ రవి కృష్ణ చెస్ బోర్డుపై పావులు కదిపి చదరంగం పోటీలను లాంచనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఆర్బిటర్ సుజాత, కోచ్ సురేష్, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Arattai