NANDYAL June 18:- RTE చట్ట సవరణ ద్వారా 2010 టెట్ నోటిఫికేషన్ కు ముందు నియామకం పొందిన ఉపాధ్యాయులను టెట్ తప్పనిసరి ఉత్తీర్ణత నుండి మినహాయింపు కల్పించవలసిందిగా జిల్లా కలెక్టర్ ద్వారా శ్రీయుత భారత ప్రధానమంత్రి గారికి, శ్రీయుత కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మాత్యుల వారికి, శ్రీయుత ముఖ్య మంత్రివర్యులు ఆంధ్రప్రదేశ్ వారికి ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం నంద్యాల జిల్లా శాఖ తరఫున డిఆర్వో రాము నాయక్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది.ఇటీవల గౌరవ భారత సర్వోన్నత న్యాయస్థానం 2010 టెట్ నోటిఫికేషన్ కు ముందు నియామకం పొందిన ఉపాధ్యాయులు కూడా ప్రస్తుతము తప్పనిసరిగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) ఉత్తీర్ణత పొందాలని, లేనిపక్షంలో ఉపాధ్యాయులు ఉద్యోగం నుండి తొలగింపబడవలసి ఉంటుందని తీర్పునిచ్చింది ఈ తీర్పు నేపథ్యంతో 2010 టెట్ నోటిఫికేషన్ కు ముందు నియామకం పొందిన ఉపాధ్యాయుల ఉద్యోగ భద్రత, పదోన్నతి పై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతో పార్లమెంట్ లో చట్టసవరణ ద్వారా ఉపాధ్యాయులు టెట్ తప్పనిసరి ఉత్తీర్ణత నియమము 2010 టెట్ నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుండి అమలు చేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఆపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి టి వెంకటేశ్వర్లు జిల్లా ఆర్థిక కార్యదర్శి శ్రీపతి గౌరవ అధ్యక్షులు పినాక పాణి రాష్ట్ర మీడియా ఇంచార్జి మల్లికార్జున నంద్యాల మండలం ప్రధాన కార్యదర్శి చవాన్ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ మరియు ముఖ్య కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
I’m Vasu, a journalist with 20 years of experience, now bringing you news through Nandi News.
Arattai