AP-ప్రపంచ అనస్తీషియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ రవికృష్ణ కు సత్కారం

NANDYAL; Oct 16:- గురువారం ప్రపంచ అనస్తీషియా దినోత్సవం పురస్కరించుకుని, స్థానిక కళారాధన కార్యాలయంలో నంద్యాల మొట్టమొదటి అనస్తీషియా వైద్య నిపుణులు డాక్టర్ రవి కృష్ణ ను జిల్లా బాషోపాధ్యాయుల సంస్థ అధ్యక్ష కార్యదర్శులు కన్నయ్య, హుస్సేన్ మియా ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత అవ్వారి శేష ఫణి,ఉపాధ్యాయ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి అన్నెం శ్రీనివాసరెడ్డి, బాషోపాధ్యాయుల సంస్థ జిల్లా అధ్యక్షులు కన్నయ్య,ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ 1992లో నంద్యాలకు మొట్టమొదటి అనస్తీషియా వైద్య నిపుణులుగా వచ్చిన డాక్టర్ రవి కృష్ణ గత 33 సంవత్సరాలుగా విశిష్ట అనస్తీషియా వైద్య సేవలు అందించారని కొనియాడారు. కొన్ని వేల శస్త్ర చికిత్సలకు మత్తుమందు ఇచ్చి వివిధ రకాల శస్త్ర చికిత్సల కోసం నగరాలకు నంద్యాల ప్రజలు వెళ్లాల్సిన అవసరం లేకుండా నంద్యాలలోనే జరగడానికి దోహదం చేశారని అన్నారు.

మొట్టమొదటి ఎమర్జెన్సీ ఆసుపత్రి సురక్ష ఎమర్జెన్సీ ఆసుపత్రి ఏర్పాటు చేసి 15 సంవత్సరాల పాటు ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు విశేష సేవలు చేశారని గుర్తు చేశారు. కేవలం వైద్యుని గానే కాకుండా కళారాధన వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా నంద్యాల ప్రాంతంలో కళలను విశేషంగా ప్రోత్సహించారని, రచయితగా కథలు,నాటకాలు రాయడమే కాకుండా,నాటక దర్శకులుగా నంద్యాలకు అనేక నంది పురస్కారాలను,వివిధ పరిషత్తు పోటీల రాష్ట్రస్థాయి బహుమతులను తీసుకువచ్చారని, జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులుగా దివ్యాంగులకు నిరంతర సేవలు అందిస్తున్నారని, లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులుగా నిరంతర సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, జిల్లా, రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను నంద్యాలలో నిర్వహించి క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. వీరి కృషికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కళా రత్న హంస పురస్కారం, ఉగాది తెలుగు తల్లి పురస్కారం, కందుకూరి రాష్ట్రస్థాయి తెలుగు నాటక రంగ పురస్కారాలు అందజేసి గౌరవించారని అన్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలు సంస్థల పురస్కారాలు డాక్టర్ రవి కృష్ణ అందుకున్నారని చెప్పారు.

జీఎస్టీ 2.0 సామాన్య ప్రజలకు ఊరటనిచ్చే సంస్కరణ

ఈర్నపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు నరేంద్ర, డాక్టర్ రవి కృష్ణ కు అందజేసిన సన్మాన పత్ర పద్యాలు పాడి వినిపించారు

డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ తాను నంద్యాలలో 1992 లో వచ్చానని, అంతకు ముందు అనస్తీషియా వైద్యులు కర్నూలు నుండి వచ్చేవారని, తాను వచ్చిన తర్వాత స్థానికంగానే అనస్తీషియా వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. ప్రస్తుతం నంద్యాల లో దాదాపు 30 మంది అనస్తీషియా వైద్య నిపుణులు సేవలందిస్తున్నారని తెలిపారు.వైద్యునిగా ఈ సేవలు కొనసాగిస్తూ, కళా, సేవా, క్రీడా రంగాలలో తన కృషిని కొనసాగిస్తానని చెప్పారు. అనస్తీషియా దినోత్సవం రోజు తనను గుర్తుంచుకుని సత్కరించిన ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా బాషోపాధ్యాయుల సంస్థ ప్రతినిధులు దామోదర్ విశ్వనాథరెడ్డి సుధాకర్ గౌడ్, లింగమయ్య ముస్తఫా, జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎం.పీ.వి. రమణయ్య తదితరులు పాల్గొన్నారు.

AP -బదిలీ అయిన ఉపాధ్యాయులను రిలీవ్ చేయాలి:కన్నయ్య

I’m Vasu, a journalist with 20 years of experience, now bringing you news through Nandi News.