NANDYAL Oct 16:-రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ (ఎస్ ఎల్ టి ఏ) ఆధ్వర్యంలో గురువారం నంద్యాల ఎన్జీవో హోంలో పలు విద్యారంగ సమస్యలపై చర్చా కార్యక్రమం ఏర్పాటు చేశారు.కార్యక్రమంలోఎస్ ఎల్ టి ఏ జిల్లా అధ్యక్షులు కన్నయ్య మాట్లాడుతూ జూన్ నెలలో బదిలీ అయిన హిందీ భాషోపాధ్యాయులు ఉమ్మడి కర్నూలు జిల్లాలో డీఎస్సీ 2025 ఉపాధ్యాయులు వచ్చినప్పటికిని రిలీవర్ లేక బదిలీ కాలేదన్నారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు వందమంది ఉపాధ్యాయులు బదిలీ అయి కొత్త పాఠశాలలో జీతాలు తీసుకుంటూ పాత పాఠశాలలో పనిచేస్తున్నారని తెలిపారు.
వీరిలో హిందీ భాషో ఉపాధ్యాయులు అధిక శాతం ఉన్నారన్నారు. వీరిని రిలీవర్ల తో సంబంధం లేకుండా వెంటనే రిలీవ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో డీఎస్సీ 2025 హిందీ పోస్టులు 143 గాను 140 భర్తీ చేశారని కానీ ఇంకా 315 పోస్టులు కొత్తగా శాంక్షన్ అయిన పోస్టులతో కలిపి ఖాళీగా ఉన్నాయని తెలిపారు.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వము ఉమ్మడి కర్నూలు జిల్లాకు ప్రత్యేకంగా అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించి బదిలీ కాబడిన ఉపాధ్యాయుల సమస్యను తీర్చాలన్నారు. డి ఈ ఓ పూల్ పండితుల పదోన్నతుల కోసం కృషి చేసిన కన్నయ్యను సంఘ సభ్యులు ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి హుస్సేన్ మియా, అన్నెం శ్రీనివాస రెడ్డి శేషఫణి లింగమయ్య, విశ్వనాధ్ రెడ్డి, దామోదర్, రఫీ, నరసింహారెడ్డి ,ముస్తఫా పాల్గొన్నారు.
Leave a Reply