నంద్యాల పట్టణానికి చెందిన చిన్నారి నిధీశ దీపావళి పండుగ సందర్భంగా వేసిన చిత్రం అందరినీ ఆకర్షిస్తూ ఆలోచింపజేస్తుంది.నంద్యాలకు చెందిన కోటీశ్వర రెడ్డి ,మంజూష దంపతుల కుమార్తె చిన్నారి నిధీశ దీపావళి పండుగ సందర్భంగా గీసిన చిత్రం పలువురు ప్రశంసలు అందుకుంది.
“హ్యాపీ దివాళి”శీర్షికతో వేసిన ఆ చిత్రంలో దీపం,పూలు,పటాకులు,కమలాలు వంటి ఆకృతులను అందంగా చిత్రించి పండుగ ఆనందాన్ని ప్రతిబింబించింది.దీపావళి సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, కాలుష్యం లేకుండా పండుగ జరుపుకోవాలని చిన్నారి నిధీశ కోరుకుంది.
“దీపాల వెలుగుతో మన హృదయాలను వెలిగించాలి కానీ, పొగతో ప్రకృతిని కలుషితం చేయకూడదు” అని చిన్నారి తెలిపింది.చిన్న వయసులోనే ఇంత సృజనాత్మకంగా మరియు సామాజిక సందేశంతో కూడిన చిత్రకళను ప్రదర్శించిన నిధీశ ని కుటుంబ సభ్యులు,గురువులు,స్థానికులు అభినందించారు.
Leave a Reply