నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ కళాశాల నందు శుక్రవారం వ్యక్తిగత మరియు సామూహిక పరిశుభ్రత అవగాహన సదస్సు ను నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ శశికళ తెలిపారు.
ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ గారు అధ్యక్షత వహిస్తూ నేటి సమాజంలో పరిశుభ్రత వాటి యొక్క ప్రాధాన్యత గురించి విద్యార్థులకు వివరించారు.

ఈ కార్యక్రమం కు ప్రత్యేక వక్తగా విచ్చేసినటువంటి బాటని అధ్యాపకులు పి ఇ విజయానంద్ మాట్లాడుతూ పరిశుభ్రత అనేది మూడు అంశాలుగా ఉంటుందంటూ వ్యక్తిగత పరిశుభ్రత మానసిక పరిశుభ్రత అలాగే సామూహిక పరిశుభ్రత అని ఈ అంశాల పైన విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించడం జరిగింది.
విద్యార్థులు ఈ విషయాలను అవగతం చేసుకొని సమాజంలో పరిశుభ్రమైనటువంటి పరిస్థితులను నెలకొల్పాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపల్ శశికళ విజయానంద్. స్వర్ణాంధ్ర కోఆర్డినేటర్ కే శ్రీనివాసులు,కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
Arattai