NANDYAL:-జిల్లా జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్ శుక్రవారం నంద్యాల పట్టణంలోని ఏపీ ఎస్ బి సి ఎల్ మరియు ఐ ఎం ఎఫ్ ఎల్ డిపోను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్… డిపోలో ఉన్న ఐ ఎం ఎఫ్ ఎల్ మరియు బీర్ స్టాక్ యొక్క ప్లాట్లను క్షుణ్ణంగా పరిశీలించి స్టాక్ యొక్క ఓపెనింగ్ బ్యాలెన్స్ చెక్ చేయడం జరిగింది.

డిపో లో ఉన్న రికార్డులన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే డిపో సేల్స్, ఏపీ సురక్ష యాప్, గురించి డిపో మేనేజర్ నాగేష్ ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డిపో పరిసరాలను కలియతిరిగి ఐ ఎం ఎల్ మరియు బీర్ లోడింగ్ అన్ లోడింగ్ కేసులకు సంబంధించి అక్కడి సిబ్బందికి పలు అంశాలు తెలియజేసి దిశా నిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సూపర్వైజర్ కోటిరెడ్డి, ఎక్సైజ్ సిబ్బంది, డిపో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Arattai