నంద్యాల అయ్యప్ప స్వామి భక్తులకు, జిల్లా వాసులకు దక్షిణ మధ్య రైల్వే శాఖ శుభవార్త చెప్పిందని, నంద్యాల మీదుగా కేరళలోని శబరిమలైకి10 స్పెషల్ ట్రైన్లు దక్షిణ మధ్య రైల్వేశాఖ ఏర్పాట్లు చేసినట్లు నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి గురువారం తెలిపారు.
తన విన్నపం మేరకు మచిలీపట్నం నుండి కొల్లంకు 5 స్పెషల్ రైళ్లు, కొల్లం నుండి నంద్యాల వైపు 5 స్పెషల్ ట్రెయిన్లు నడిపేందుకు కేంద్ర రైల్వే శాఖ అధికారులు అంగీకారం తెలిపినట్లు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి తెలిపారు.

నంద్యాల నుండి బనగానపల్లి మీదుగా డిసెంబర్, జనవరి నెలలో ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయని, నంద్యాల పార్లమెంటు పరిధిలోని అన్ని చోట్ల భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించాలనీ అయ్యప్ప భక్తులు ఈ రైళ్ల సేవలను ఉపయోగించాలని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కోరారు.
రైలు నెంబర్ 07103 మచిలీపట్నం- కొల్లం ప్రతి శుక్రవారం డిసెంబర్ నెలలోని 5,12,19, జనవరి 9,16 తేదీలలో మచిలీపట్నం నుండి బయలుదేరి నంద్యాలకు రాత్రి 8:40 కు కొల్లం కు బయలుదేరుతుందని, రైలు నెంబర్ 07104 డిసెంబర్ 7,14,21 జనవరి 11,18 తేదీలలో ప్రతి ఆదివారం కొల్లం నుండి ఉదయం 2:30 కు బయలుదేరి మరుసటి రోజున నంద్యాలకు ఉదయం 3:20 కు చేరుకుంటుందని ఆమె అన్నారు. అయ్యప్ప స్వామి భక్తులకు, జిల్లా ప్రజలకు నంద్యాల పార్లమెంట్ లో ఏర్పాటు చేసిన ఈ 10 స్పెషల్ రైళ్లకు కేంద్ర రైల్వే అధికారులు అనుమతి ఇచ్చినందుకు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ కు ధన్యవాదములు తెలిపారు.
Arattai