NANDYAL Jan31 :- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిన్న ప్రకటించిన ఏపీపిఎస్సీ గ్రూప్ 1 ఫలితాలలో 87 మంది రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక కాగా, అందులో నంద్యాల ఎన్జీవో కాలనీ కి చెందిన మౌనిక ఎంపిడిఓ ఉద్యోగానికి ఎంపికయ్యారు. మౌనిక దివంగత ప్రముఖ వైద్యులు డాక్టర్ తిప్పారెడ్డి మనవరాలు. మౌనిక ఎంపికైన విషయం ఆమె తల్లి తండ్రులు లక్ష్మీ మోహన్ రెడ్డి, సౌజన్య కుమారి పాత్రికేయులకు తెలిపారు.
మౌనిక స్థానిక గుడ్ షెఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో పదవ తరగతి వరకు, రావూస్ జూనియర్ కళాశాల లో ఇంటర్మీడియట్ పూర్తి చేసి కంచి ఎస్ ఆర్ ఎం ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్, ఎంబీఏ లలో ఉత్తీర్ణత సాధించింది. క్రీడలలో బాల్ బ్యాడ్మింటన్ క్రీడ లో ఐదు సార్లు స్టార్ ఆఫ్ ఇండియా అవార్డు అందుకున్నది. కొంత కాలం పోస్టల్ శాఖలో పని చేసి తదుపరి మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ శాఖలో బెంగళూరు లో పని చేస్తూ ఏపీపిఎస్సీ పరీక్షలకు సిద్ధం కావడం జరిగింది.
ఈ పరీక్షలో విజేతగా నిలవడానికి బెంగళూరు లో బ్యాంక్ ఆఫ్ బరోడా లో మేనేజర్ గా పనిచేస్తున్న తన భర్త కృష్ణ కాంత రెడ్డి, తల్లి తండ్రులు లక్ష్మీ మోహన్ రెడ్డి, సౌజన్య కుమారి ల ప్రోత్సాహం కారణమని మౌనిక తెలిపారు. పోటీ పరీక్షలకు వెళ్లాలనుకునే వారు ప్రణాళిక బద్దంగా, సమయాన్ని సద్వినియోగం చేసుకుని, క్రమ శిక్షణ తో పట్టుదల తో కృషి చేస్తే తప్పక అనుకున్న ఫలితాలు సాధించ గలరని అన్నారు.ఈ సందర్భంగా మౌనిక ను ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, ఐఎంఏ నంద్యాల మాజీ అధ్యక్షులు డాక్టర్ మధుసూదనరావు తదితరులు అభినందించారు.
Arattai