రైతు నాయకులు,స్వాతంత్ర సమరయోధుడు, ప్రముఖ పార్లమెంటేరియన్, ఆచార్య ఎన్జీరంగా 126 వ జన్మదినోత్సవాన్ని నంది రైతు సమాఖ్య కార్యాలయం,నంద్యాలలో ఘనంగా నిర్వహించారు… మాతృభాషా పరిరక్షణ సమితి నంది రైతు సమాఖ్య ఆధ్వర్యంలో శుక్రవారం రైతు సమాఖ్య అధ్యక్షులు రామసుబ్బారెడ్డి నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశ్రాంత శాస్త్రవేత్త కాదర్ బాద్ రవీంద్రనాథ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు..
ఆచార్య ఎన్జీరంగా చిత్రపటానికి పూలమాలవేసి సమాఖ్య సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం డా .రవీంద్రనాథ్ మాట్లాడుతూ వ్యవసాయ కార్మికులు రైతాంగ సమస్యలపై ఆచార్య ఎన్జీరంగా నిరంతరం పోరాడారని ఆరుసార్లు పార్లమెంటు సభ్యునిగా ఎంపికై చరిత్ర సృష్టించి ప్రజాభిమానం పొందారని తెలిపారు.ఎన్జీరంగా సేవలకు గుర్తింపుగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఎన్జీరంగా పేరు పెట్టడం జరిగిందన్నారు.

రామ సుబ్బారెడ్డి మాట్లాడుతూ రైతు కార్మికుల పక్షాన ఎన్జీరంగా జమీన్ రైతు ఉద్యమాలు నడిపాడని ఐక్యరాజ్యసమితిలో రైతు సమస్యలపై ప్రసంగించారని తెలిపారు. భారతదేశం వ్యవసాయక దేశమని రైతు సంక్షేమంతోనే దేశ ప్రగతి సాధ్యమన్నారు.. నేటి తరం నాయకులు ఎన్జీరంగా బాటలో పయనించాల్సిన అవసరం ఉందన్నారు… రెండు దశాబ్దాలుగా నందిరైతు సమాఖ్యకు విస్తృతంగా సేవలు అందించి రైతు సంక్షేమానికి కృషిచేసిన సమాఖ్య మాజీ అధ్యక్షులు ఉమామహేశ్వరరెడ్డిని కార్యక్రమంలో రైతులు ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో సమాఖ్య కార్యదర్శి మధుసూదన్ రెడ్డి కోఆర్డినేటర్ ఓబులపతి రైతు నాయకులు తూముశివారెడ్డి, మాధవస్వామి, హరినాథ్ రెడ్డి, గంగాధర రెడ్డి మాతృభాషా పరిరక్షణ సమితి కార్యదర్శి అన్నెం శ్రీనివాస రెడ్డి సాహితీ సంఘాల నిర్వాహకులు డాక్టర్ కిషోర్ కుమార్, రచయిత రామకృష్ణారెడ్డి , మురళీ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు…. రైతు శ్రేయస్సును కాంక్షిస్తూ కవులు కొప్పుల ప్రసాద్ మహమ్మద్ రఫీ వినిపించిన కవితలు అందర్నీ అలరించాయి…
Arattai