NANDYAL Nov 17:నంద్యాల జిల్లాను కుష్ట వ్యాధి గ్రహీత జిల్లాగా తీర్చిదిద్దేందుకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా పేర్కొన్నారు.
సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాల్ నందు జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, తదితర అధికారులతో కలిసి జాతీయ కుష్ఠ వ్యాధి నిర్మూలన కార్యక్రమం పోస్టర్ ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా మాట్లాడుతూ…. ఈనెల 17వ తేదీ నుంచి నవంబర్ 30 వరకు కుష్ట వ్యాధి ఇంటింటి సర్వే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.ఈ సర్వే కార్యక్రమాన్ని వైద్యాధికారులు సిబ్బంది పకడ్బందీగా చేపట్టి జిల్లాను కుష్ఠ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలన్నారు.
కుష్ట వ్యాధి “మైకో బ్యాక్టీరియం లెప్రే” అను బ్యాక్టీరియా వలన వస్తుందన్నారు. ఈ క్రిములు తుమ్మడం, దగ్గడం వలన వ్యాప్తి చెందుతాయన్నారు. ఈ వ్యాధి లక్షణాలు కనిపించుటకు ఐదు నుంచి ఏడు సంవత్సరాలు పడుతుందన్నారు.
చర్మంపై స్పర్శ లేని రాగి రంగు మచ్చలు, పొడలు నొప్పి కూడిన నరములు, కాళ్లు లేదా చేతుల కండరాలలో బలహీనత, చేతులు, పాదాలు, నరములలో తిమ్మిర్లుగా అనిపించడం, నొప్పిగా అనిపించని పుండ్లు చేతులలో పాదాలలో ఉండటం వంటి లక్షణాలు ఉంటాయని ఈ వ్యాధి నిర్మూలనకు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు.
Arattai