AMARAVATHI Nov25:-రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో కృషి చేస్తున్నదని హోం మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు.
వెలగపూడి సచివాలయంలోని కార్యాలయంలో హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజీత్ ఐపీఎస్, స్పెషల్ సెక్రటరీ విజయ్‌కుమార్ ఐపీఎస్, పీటీవో ఎస్పీతో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో రాష్ట్రంలోని శాంతిభద్రత పరిస్థితులు, నేర నియంత్రణ, టెక్నాలజీ వినియోగం, పోలీస్ విభాగానికి అవసరమైన వనరులపై సమగ్రంగా చర్చించారు.

ఈ సందర్భంగా హోం మంత్రి అనిత మాట్లాడుతూ, నేర నియంత్రణకు అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వసతుల విషయంలో ప్రభుత్వం రాజీపడదని తెలిపారు. త్వరలోనే అన్ని పోలీస్ స్టేషన్లకు కొత్త వాహనాలను అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయని ఆమె వెల్లడించారు.
Arattai