NEW DELHI Dec 18:-భారతదేశంలో ఆధునిక సాంకేతిక విద్య బలోపేతంకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, పార్లమెంటరీ విద్యాశాఖ సలహా కమిటీ మెంబెర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు.
గురువారం న్యూ ఢిల్లీ లో పార్లమెంట్ విద్యాశాఖకు అనుబంధంగా ఏర్పాటైన సలహా సంఘం 3వ సమావేశంలో “విద్యాబోధన–అభ్యాసంలో కృత్రిమ మేధస్సు (AI) వినియోగం” అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విద్యా రంగాన్ని ఆధునిక సాంకేతికతతో మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో, భవిష్యత్ తరాల కోసం నాణ్యమైన, సమగ్రమైన విద్యను అందించే దిశగా కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు.
Arattai