AMARAVATHI Nov 27:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలోని వెంకటపాళెం శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయ రెండవ ప్రాకారం అభివృద్ధి పనులకు గురువారం ఉదయం 11 నుండి 11.30 గంటల నడుమ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీనారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా భూమిపూజ, అద్వేష్టక శిలేష్టకాన్యాసం వైభవంగా జరిగింది.

ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలకు శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఉత్సవర్లను వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు చతుర్వేద పారాయణం, నివేదనం, దివ్య సమర్పణ, హోమం, పూర్ణాహుతి, వేదాశీర్వచనం నిర్వహించారు.

మొదటగా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీనారా చంద్రబాబునాయుడు యాగశాలకు వేంచేసి పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అర్చకుల వేద మంత్రాలు, మంళవాయిధ్యాలు, భక్తుల గోవిదంనామస్మరణల నడుమ గౌ|| ముఖ్యమంత్రివర్యులు పునాది రాయి వేయడంతో ఆలయంలో ద్వితీయ మహాప్రాకారము, చతుర్థ్యార గోపురముల నిర్మాణాము, వివిధ అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి.

అనంతరం గౌరవ ముఖ్యమంత్రివర్యులు అమరావతిలోని శ్రీవారి ఆలయ అభివృద్ధికి రూపొందించిన మాస్టర్ ప్లాన్ పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. తర్వాత గౌరవ ముఖ్యమంత్రి
ఆలయంలోని ధ్వజస్తంభానికి, నమస్కరించి, స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం టిటిడి చైర్మన్ గౌ.ముఖ్యమంత్రివర్యులకు శ్రీవారి లడ్డు ప్రసాదాలు అందజేశారు. వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు.

Arattai