NANDYAL Nov 28:- మీ డబ్బు మీ హక్కు కార్యక్రమం ద్వారా గత 10 సంవత్సరాల నుంచి క్లైమ్ చేయని డబ్బు తిరిగి పొందవచ్చునని జిల్లా లేట్ బ్యాంక్ మేనేజర్ రవీంద్ర కుమార్ పేర్కొన్నారు.
శుక్రవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాల్ నందు మీ డబ్బు మీ హక్కు కార్యక్రమంపై ప్రజలకు ఖాతాదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా లేట్ బ్యాంక్ మేనేజర్ రవీంద్ర కుమార్ మాట్లాడుతూ… వివిధ బ్యాంకుల ఖాతాదారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఆర్బిఐ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని బ్యాంకులు సమన్వయంతో మీ డబ్బు మీ హక్కు అనే కార్యక్రమం పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు.

గత 10 సంవత్సరాల నుంచి క్లైమ్ చేయనటువంటి మీ ఖాతాలలో ఉండే డబ్బు రిజర్వ్ బ్యాంకుకు వెళ్లడం జరిగిందన్నారు. మన జిల్లాలో సుమారు 64.59 కోట్ల రూపాయలు 3.19 లక్షల మంది అకౌంటులలో ఉన్నందున ఈ డబ్బు అంతా ఆర్.బి.ఐ లో సేఫ్ గా ఉంది. ఈ డబ్బును మనం తిరిగి ఉపయోగించుకోవడానికి ఆర్బిఐ ఆదేశాల మేరకు మీ డబ్బు మీ హక్కు అనే కార్యక్రమం ద్వారా ఏ బ్యాంకుకు సంబంధించిన ఖాతాదారులకు ఆ బ్యాంకు తరపున స్టాల్స్ ఏర్పాటు చేసి వారికి అవగాహన కల్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి శ్రీధర్ రెడ్డి, డ్వామా, మెప్మా పీడీలు, ఎస్బిఐ చీఫ్ మేనేజర్ మనోహర్, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి, వివిధ బ్యాంకుల ఖాతాదారులు తదితరులు పాల్గొన్నారు.
Arattai