డిసెంబర్ 3 ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకుని బుధవారం స్థానిక ఎన్టీఆర్ పురపాలక టౌన్ హాల్ లో నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో, ఐఎంఏ నంద్యాల, లయన్స్ క్లబ్ నంద్యాల సంయుక్త సహకారంతో దివ్యాంగులకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్. ఎం.డి.ఫరూక్ ను, అధికారులను ఆహ్వానించినట్టుగా జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, అధ్యక్షులు ఎంపీ వి రమణయ్య, ప్రధాన కార్యదర్శి రామలింగం మంగళవారం నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో తెలియజేశారు.
గత 24 సంవత్సరాలుగా ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నామని, ఈ సంవత్సరం కూడా దాదాపు 1,000 మంది పైగా దివ్యాంగులు హాజరవుతున్నారని, వారందరికీ నూతన వస్త్రాలు, అవసరమైన వారికి చక్రాల కుర్చీలు, మోటార్ తో పనిచేసే కుట్టు మిషన్లు,వినికిడి యంత్రాలు,చంక కర్రలు, దివ్యాంగ విద్యార్థులకు ఉపకార వేతనాలు,దీర్ఘకాలిక జబ్బుల తో బాధపడుతున్న దివ్యాంగులకు నెలవారి మందులను అందజేస్తారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ దివ్యాంగుల హక్కుల చట్ట ప్రతులను ఆవిష్కరిస్తారు.
ఈ ఉత్సవానికి హాజరవుతున్న దివ్యాంగులందరికీ ఓంకార క్షేత్రంలోని కాశిరెడ్డి నాయన ఆశ్రమం భోజన ఏర్పాట్లు చేశారు.రామకృష్ణ డిగ్రీ కళాశాల ఎన్.సి.సి. క్యాడేట్స్ దివ్యాంగులకు కార్యక్రమం నిర్వహణకు సహకరిస్తారు.
ఈ ఉత్సవంలో నంద్యాల పట్టణం,పరిసర ప్రాంతాల దివ్యాంగులందరూ పాల్గొనవలసిందిగా కోరారు.
ఈ పాత్రికేయ సమావేశంలో సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ,అధ్యక్షులు రమణయ్య, ప్రధాన కార్యదర్శి రామలింగం, ఉపాధ్యక్షులు సుబ్బారెడ్డి, కార్యవర్గ సభ్యులు హనీఫ్ ఖాన్, రంగస్వామి, కార్యాలయ కార్యదర్శి మధు పాల్గొన్నారు.
Arattai