నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయం సందర్శించిన చైర్మన్ నారాయణస్వామి.
విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి, అభివృద్ధికి కృషి చేస్తాం: నారాయణస్వామి
NANDYAL Dec 11:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నారాయణస్వామి నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయం సందర్శించిన సందర్భంగా సంఘం తరఫున గౌరవ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, అధ్యక్షులు రమణయ్య, ప్రధాన కార్యదర్శి రామలింగం నారాయణ స్వామిని శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా నారాయణస్వామి మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రకటించారని, వారి అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి కొనసాగిస్తుందని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే దివ్యాంగుల పెన్షన్ 3000 నుండి దేశంలో మరెక్కడ లేని విధంగా 6000 కు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానికి చెందుతుందని నారాయణస్వామి అన్నారు.
డాక్టర్ రవి కృష్ణ, రమణయ్య మాట్లాడుతూ ఉమ్మడి కర్నూలు జిల్లా కు కలిపి దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయం కర్నూలులో కొనసాగుతుందని, నంద్యాల జిల్లాకు దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయం ఏర్పాటు చేసి అధికారులను నియమించినట్లయితే జిల్లాలోని దివ్యాంగులకు అభివృద్ధి పథకాలను అమలు చేయడానికి అవకాశం మెరుగవుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ రవి కృష్ణ, రమణయ్య లతో పాటు, సంఘం కార్యదర్శి రామలింగం, కార్యవర్గ సభ్యుడు రంగ స్వామి, కార్యాలయ కార్యదర్శి మధు పాల్గొన్నారు.
Arattai