అంతర్జాతీయ స్థాయి దిగ్గజ ఐటీ కంపెనీ విశాఖలో అడుగుపెట్టటం చారిత్రాత్మక మైలురాయి
విజన్ వాస్తవ రూపం దాలిస్తే కాగ్నిజెంట్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు మారతాయి
2025 లో దావోస్ కలిసి కాగ్నిజెంట్ ను విశాఖకు ఆహ్వానించాం. ఇప్పుడు మళ్లీ దావోస్ కు వెళ్లకముందే ఆ సంస్థ ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించింది. నూతన కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేసింది

ప్రోత్సాహకంగా ఎకరా భూమిని 99 పైసలకు ఇస్తామని వారికి హామీ ఇచ్చాం. ఆ మేరకే వారికి భూమి ఇచ్చాం
సీఎం చంద్రబాబుకు 11 నెలలు అంటే సుదీర్ఘ కాలం. ఆయనకు రియల్ టైమ్ లో నిర్ణయాలు జరగాలని ఆశిస్తారు

ఆయన కేబినెట్ లో మంత్రులందరం స్వేచ్ఛగా రాష్ట్ర అభివృద్ధికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం
విశాఖపట్నం ఐటీ, జీసీసీ కేంద్రంగా మారుతుంది. విశాఖ ఎకనామిక్ రీజియన్ కూడా ఈ ప్రాంత అభివృద్ధిని మారుస్తుంది
వై నాట్ వైజాగ్ అనే ప్రశ్న ఉదయించేలా ఐటీ కంపెనీలు, పరిశ్రమల్ని ఈ ప్రాంతానికి ఆహ్వానిస్తున్నాం

ఆర్సెలార్ మిట్టల్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ ఈ ప్రాంతానికి వస్తోంది
గతంలో హైదరాబాద్ లో ఊరు చివరగా జూబ్లిహిల్స్ చెక్ పోస్టు ఉండేది. ఇప్పుడు అక్కడ చెక్ పోస్టు కాదు అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలకు ప్రతీకగా మెట్రో స్టేషన్ ఉంది
మా ముఖ్యమంత్రి ఓ జీపీఎస్, నిరంతరం అందరినీ అభివృద్ధి వెంట పరుగులు పెట్టిస్తారు

రాష్ట్రంలో పెట్టిన ప్రతీ ప్రాజెక్టునూ ప్రభుత్వ ప్రాజెక్టుగా భావించి చేయూత అందిస్తామని చెప్పాం. ఇప్పుడు కాగ్నిజెంట్ కు కూడా అదే స్థాయి ప్రోత్సాహం అందిస్తాం
కాగ్నిజెంట్ లో పనిచేసే ఉద్యోగులంతా విశాఖ బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలి

5 లక్షల ఐటీ ఉద్యోగాలు ఈ ప్రాంతానికి వచ్చేలా మా ప్రభుత్వం కృషి చేస్తుంది
ప్రధాని నరేంద్ర మోదీ భారత్ ను అభివృద్ధిబాటలో నడుపుతుంటే ఏపీని సీఎం చంద్రబాబు నాయుడు పురోగతి బాట పట్టిస్తున్నారు
వారిరువురూ 25 ఏళ్ల వయస్సున్న యువకుల్లా దేశ, రాష్ట్రాభివృద్ధికి పనిచేస్తున్నారు.

Arattai