NANDYA:- నంద్యాల పట్టణంలో బుధవారం రైల్వే పెన్షనర్స్ డేను నంద్యాల రైల్వే పెన్షన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రైల్వే డాక్టర్ వినయ్ కుమార్,నంద్యాల ADN తిరుమలరావు, గుంటకల్లు డివిజన్ పెన్షనర్స్ అసోసియేషన్ డివిజనల్ సెక్రెటరీ రంగస్వామి, గుంటూరు డివిజన్ పెన్షన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామాంజనేయులు, సెక్రెటరీ నరసయ్య నంద్యాల పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కృష్ణమూర్తి, కార్యదర్శి అన్వర్, కోశాధికారి చంద్రశేఖర్ ఆచారి, పెన్షనర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1982 డిసెంబర్ 17వ తేదీన సుప్రీంకోర్టులో పెన్షనర్స్ కి అనుకూలంగా తీర్పు వచ్చిన రోజుని పెన్షనర్స్ డే గా జరుపుకుంటామని వారు తెలిపారు. రైల్వేలో సేవ చేయడం అంటే దేశానికి సేవ చేయడమేనని వారు తెలిపారు. పెన్షనర్స్ తమ సమస్యలను అసోసియేషన్ దృష్టికి తీసుకుని వస్తే సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని వారు తెలిపారు.
Arattai