NANDYAL Dec 17:-నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ నందు స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ పెన్యూర్ అంశంపై అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ శశికళ తెలిపారు.
ప్రతి ఒక్క కుటుంబంలో ఒకరు పారిశ్రామికవేత్తగా ఎదిగి సమాజంలో ప్రభుత్వ ఉద్యోగాల మీదనే ఆధారపడకుండా ఒక పారిశ్రామికవేత్తగా ఎదిగి ఇతరులకు అవకాశాలు కల్పించాలని వారు తెలిపారు
ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితునిగా వచ్చినటువంటి స్కిల్ డెవలప్మెంట్ మెంటర్ బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి ఒక ఎంటర్ప్యూర్ గా ఎదగాలని ఈ సందర్భంగా వాటి యొక్క లక్షణాలు సమాజంలో వాటికి ఉండేటటువంటి అవకాశాల గురించి విద్యార్థులకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమం నందు స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కోఆర్డినేటర్ శ్రీనివాసులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగింది
Arattai