నంద్యాల లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు శుక్రవారం మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో శక్తి యాప్ మరియు శక్తి టీమ్స్ పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ శశికళ తెలిపారు.ప్రభుత్వ చట్టాల ద్వారా ప్రస్తుత సమాజంలో ఎటువంటి రక్షణ కల్పించడం జరుగుతుందో విద్యార్థులకు తెలియజేశారు.టీమ్స్ ఏర్పాటును,వాటి పనితీరును మరియు మహిళల రక్షణ గురించి మహిళా పిఎస్ సీఐ జయరాం తెలియజేశారు
ప్రతి సంవత్సరం మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు శక్తి టీం, పోక్సో ఆక్ట్, చైల్డ్ మ్యారేజెస్ అంశాలపై అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి మహిళా పిఎస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ జయరాం గారు మాట్లాడుతూ కొత్తగా సబ్ డివిజన్లో శక్తి టీమ్స్ ఏర్పాటును, వాటి పనితీరును మరియు మహిళల రక్షణ గురించి ఏ విధంగా సమర్థవంతంగా పనిచేస్తాయో వాటి పనితీరును, శక్తి యాప్ ని ఆన్లైన్ నుండి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో , యాప్ లోని ముఖ్య విషయాలను, సైబర్ సెక్యూరిటీ గురించి టోల్ ఫ్రీ నెంబర్ అయినటువంటి 100,112ఎమర్జెన్సీ నెంబర్ల గురించి మరియు మహిళలు ఎక్కువగా ఉపయోగించే బ్యూటీఫికేషన్ యాప్స్ వాడడం ద్వారా వచ్చే నష్టాల గురించి ఏఐ దుష్పరిణామాలైన ఫోటో మార్ఫింగ్, డిజిటల్ అరెస్ట్ వాటికి ఏ విధంగా స్పందించాలి, ఏ విధంగా పోలీస్ సిబ్బంది యొక్క సేవలను పొందాలో , ఎప్పుడూ మహిళలు తమ సొంత రక్షణ కొరకు టెక్నాలజీని వాడాలి కానీ అనవసరమైన ఆన్లైన్ మోసాలకి గురి కావద్దని తెలియజేశారు. ఆన్ లైన్లో లోన్ తీసుకోకుండా ఉండవలసిందిగా కూడా తెలియజేశారు.
దీనితో పాటు ఎల్లవేళలా శక్తి టీమ్స్ అధిక క్రైమ్ రేట్ నమోదు అయ్యే స్థలాలలో చాలా చాకచక్యంగా సమర్థవంతంగా పనిచేస్తున్నాయని మహిళలు భయపడకుండా వీటి సేవలను ఉపయోగించుకోవాలని తెలియజేశారు. వీటితో పాటు ప్రతి విషయంపై అవగాహన కలిగి మసులు కోవాలని, దేశాభివృద్ధిలో వారి సేవలను వినియోగించుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమానికి వైస్ ప్రిన్సిపల్ శ్రీమతి వి.జె. శైలజ, శ్రీమతి IQAC కోఆర్డినేటర్ శ్రీమతి ఎస్ పార్వతి, శ్రీమతి కుసుమ, అధ్యాపకులు మరియు విద్యార్థినిలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేశారని మహిళా సాధికారత సమన్వయకర్త డాక్టర్. రూకలశశికళ తెలియజేశారు
Arattai