NANDYAL:- నంద్యాల జిల్లా వెలుగోడు మండలం వేల్పనూరు గ్రామం నందు ఆదివారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుడ్డా శేషారెడ్డి ఆధ్వర్యంలోఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వేల్పనూరు అంకాల పరమేశ్వరి దేవి ప్రత్యేక పూజలు. అనంతరం కేర్ కట్ చేసి జన్మదిన వేడుకున్న ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి,మాజీ జెడ్పిటిసి ఫ్లోర్ లీడర్ లాలి స్వామి, పుల్లారెడ్డి, శరభారెడ్డి,భాస్కర్ రెడ్డి నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేదల గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉంటాయన్నారు. రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే వైఎస్ఆర్సిపి పార్టీయే మళ్ళీ రావాలన్నారు

Arattai