సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కర్నూలు టీజీవీ కళాక్షేత్రం ఆధ్వర్యంలో బుధవారం ఉమ్మడి కర్నూలు-నంద్యాల జిల్లా స్థాయి కవి సమ్మేళనం నిర్వహించారు.నంద్యాలకు చెందిన కవులు డా.గంగుల నాగరాజు,డా.నీలం వెంకటేశ్వర్లు,గ్రంధే నరేంద్ర ,అన్నెం శ్రీనివాసరెడ్డి ,శేషఫణి,నీలకంఠమాచారి,కొప్పుల ప్రసాద్, రఫీ తదితరులు సంక్రాంతి వైభవం గురించి పద్యం,పాట,కవితల రూపంలో మధురంగా వినిపించి ప్రశంసలు అందుకున్నారు

మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ , టీజీవి కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య, డా. హరికిషన్, యాగంటీశ్వరప్ప తదితరులు కవులను సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.

సత్కారం అందుకున్న నంద్యాల కవులను వివిధ సాహితీ సంఘాల నిర్వాహకులు డా. దీవి హయగ్రీవాచార్యులు, డాక్టర్ రవీంద్రనాథ్ , డా.రమణమూర్తి తదితరులు అభినందించారు.
Arattai