NANDYAL Jan26:- 77వ భారతదేశ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని, సోమవారం కళారాధన, నంద్యాల దివ్యాంగుల సంక్షేమ సంఘం,ఐఎంఏ, లయన్స్ క్లబ్, క్రీడా సమాఖ్య కార్యాలయం వద్ద ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు,దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు, కళారాధన ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవి కృష్ణ జాతీయ పతాకం ఆవిష్కరించి పతాక వందనం చేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, దివ్యాంగుల సంక్షేమానికి, కళలను, కళాకారులను ప్రోత్సహించడానికి, క్రీడల అభివృద్ధికి, సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగించడానికి అన్ని సంస్థలు తమ కృషిని కొనసాగిస్తాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎం. పి. వి. రమణయ్య, ఉపాధ్యక్షులు వెంకటరావు, ప్రధాన కార్యదర్శి రామలింగం,సంయుక్త కార్యదర్శి మధు కుమార్, కార్యవర్గ సభ్యులు చలపతి, దుర్గారావు,శ్రీనివాసులు, ఇండియన్ బ్యాంక్ ఆఫీసర్ మల్లేష్,నంద్యాల జిల్లా చెస్ సంఘం ప్రధాన కార్యదర్శి రామసుబ్బారెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయుడు రాజా చక్రవర్తి,కళారాధన కార్యవర్గ సభ్యుడు శివరామిరెడ్డి, రామయ్య, కార్యాలయ కార్యదర్శి ఆలా మధు, సూర్య,దివ్యాంగులు, కళారాధన సభ్యులు పాల్గొన్నారు.
Arattai