సదస్సు ప్రారంభించిన ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ
NANDYAL : నంద్యాల ఐఎంఏ, నంద్యాల యూరాలజీ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో, నంద్యాల ఐఎంఏ అకాడమిక్ విభాగం,మహిళా వైద్య విభాగం నిర్వహణలో ఆదివారం స్థానిక మధుమణి నర్సింగ్ హోమ్ సమావేశ భవనంలో వైద్య వైజ్ఞానిక సదస్సు నిర్వహించారు. నంద్యాల ఐఎంఏ శాఖకు చెందిన 14 మంది వివిధ స్పెషాలిటీ విభాగాలకు చెందిన వైద్యనిపుణులు మల్టీమీడియా ప్రజెంటేషన్ ద్వారా ప్రసంగించి వైద్య రంగంలో వస్తున్న వినూత్న విధానాలపై వైద్యులకు అవగాహన కల్పించారు.

నంద్యాల ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్ అధ్యక్షతన, నంద్యాల యూరాలజీ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ భార్గవ్ రెడ్డి పర్యవేక్షణలో ,ఐఎంఏ నంద్యాల అకాడమిక్ విభాగం అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ మల్లీశ్వరి, డాక్టర్ లలిత ల నిర్వహణలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సు ప్రారంభించారు.

ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ ఒకే శాఖ కు చెందిన 14 మంది వైద్య నిపుణులు వక్తలుగా సదస్సు నిర్వహించడం రాష్ట్రంలో ఇదే మొదటిసారి కావడం విశేషమని అన్నారు. వైద్యులు తమ వైద్య పరిజ్ఞానాన్ని నిరంతరం పెంచుకుంటూ నూతన ఆవిష్కరణలు, చికిత్సలు గురించి తెలుసుకోవాలని, తద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ఆస్కారం ఏర్పడుతుందని అన్నారు. అందుకోసమే ఈ నిరంతర వైద్య విద్యా సదస్సులు వైద్యుల కోసం నిర్వహిస్తున్నామని అన్నారు.

ఏపీ మెడికల్ కౌన్సిల్ పరిశీలకులుగా వచ్చిన డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఏపీ మెడికల్ కౌన్సిల్ ఈ సదస్సుకు రెండు అకాడమిక్ క్రెడిట్ పాయింట్స్ కేటాయించారని, ప్రాక్టీస్ చేస్తున్న ప్రతి వైద్యుడు సంవత్సరానికి ఇటువంటి ఆరు పాయింట్లు కలిగి ఉండాలని, వారు తమ రిజిస్ట్రేషన్ ను రెన్యువల్ చేసుకునే సమయంలో ఈ పాయింట్లను పరిగణనలోనికి తీసుకుని మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేయడం జరుగుతుందని అన్నారు.

సదస్సులో వివిధ అంశాలపై డాక్టర్ మధుసూదనరావు, డాక్టర్ భార్గవర్ధన్ రెడ్డి, డాక్టర్ వరదరాజ్, డాక్టర్ హిందూమతి, డాక్టర్ కోటి శ్రీనివాస్, డాక్టర్ లక్ష్మీ సౌజన్య, డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, డాక్టర్ అరుణ కుమారి, డాక్టర్ రవీందర్, డాక్టర్ శ్రీ హర్ష, డాక్టర్ శివ, డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ రవీంద్రనాథ్ రెడ్డి, డాక్టర్ పవన్ ప్రసంగించారు.

ఐఎంఏ నంద్యాల అకాడమిక్ విభాగం అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ మల్లీశ్వరి, డాక్టర్ లలిత, కోఆర్డినేటర్ డాక్టర్ సుష్మ, కోశాధికారి డాక్టర్ శశికిరణ్ లు ఈ సదస్సు నిర్వహించారు.సదస్సుకు అధిక సంఖ్యలో నంద్యాల పరిసర ప్రాంతాల వైద్యులు పాల్గొన్నారు.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీనియర్ వైద్యులు డాక్టర్ సహదేవుడు,ఐఎంఏ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ పనిల్ కుమార్, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి డాక్టర్ లక్ష్మీ సౌజన్య, రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ మధుసూదన రెడ్డి, డాక్టర్ వసుధ, డాక్టర్ హరిత, నంద్యాల మహిళా విభాగం అధ్యక్షురాలు డాక్టర్ మాధవి, కార్యదర్శి డాక్టర్ శైలజ, గౌరవ అధ్యక్షులు డాక్టర్ నాగమణి, డాక్టర్ నర్మద పాల్గొన్నారు.
Arattai