NANDYAL Feb03 :- నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు గత మూడు నెలలుగా నిర్వహిస్తున్న ఉచిత పైథాన్ మరియు డోమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సు మంగళవారం విజయవంతంగా పూర్తి చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ శశికళ తెలిపారు.ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ కోర్సు నిర్వహించినట్లు తెలిపారు.
ఇందులో భాగంగా పైథాన్ కోర్సు గాను 19 మంది డోమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సు 27 మంది శిక్షణ పొందినట్లు వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో కళాశాల స్కిల్ హబ్ ఇంచార్జ్ ఎస్ పార్వతి,మరియు నైపుణ్యాభివృద్ధి సంస్థ సమన్వయకర్త మస్తాన్ వలి ,హరిత పాల్గొన్నారు.
Arattai