NANDYAL Feb 04:- బుధవారం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం పురస్కరించుకుని స్థానిక ఉదయానంద కార్కినోస్ క్యాన్సర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో, నంద్యాల ఐఎంఏ, నంద్యాల రోటరీ క్లబ్, మహిళా వైద్య విభాగం, రోటరీ ఇన్నర్ వీల్ నిర్వహణలో ఉదయానంద ఆసుపత్రి నుండి క్యాన్సర్ పై ప్రజా అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఏ ఎస్ పి జావలి ఆల్ఫోన్స్ ముఖ్యఅతిథిగా పాల్గొని క్యాన్సర్ పై అవగాహన కరపత్రాలు ఆవిష్కరించి, ర్యాలీని ప్రారంభించారు.

ఈ సందర్భంగా జావలి ఆల్ఫోన్స్ మాట్లాడుతూ క్యాన్సర్ ను ప్రాథమిక దశలో గుర్తించడానికి, తదుపరి పూర్తిస్థాయి చికిత్స అందించి నయం చేసుకోవడానికి అత్యంత ఆధునిక వైద్య పరికరాలు, విధానాలు, ఔషధాలు అందుబాటులోకి వచ్చాయని, ప్రాథమిక దశలో గుర్తించడానికి అవసరమైన పరీక్షలు చేయించుకోవడానికి ప్రజలు సంకోచం లేకుండా ముందుకు రావలసిన అవసరం ఉందని అన్నారు.
ఉదయానంద కార్కినోస్ క్యాన్సర్ ఆసుపత్రిలో రొమ్ము క్యాన్సర్ ప్రాథమిక దశలో గుర్తించడానికి ప్రతి శనివారం నిర్వహించే ఉచిత ఓపి కార్యక్రమాన్ని ఏఎస్పీ జావలి ఆల్ఫోన్స్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఉదయానంద కార్కినోస్ క్యాన్సర్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ సాయి ప్రణీత్, డాక్టర్ సుస్మిత, డాక్టర్ కుషాల్, ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, , నంద్యాల ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్,మహిళా వైద్య విభాగం అధ్యక్షురాలు డాక్టర్ మాధవి మాట్లాడుతూ శరీరంలోని వివిధ అవయవాలలో క్యాన్సర్ ను ప్రాథమిక దశలో గుర్తించే లక్షణాలపై ప్రజలలో అవగాహన పెంచడం అవసరం అన్నారు. తద్వారా ప్రాథమిక దశలో గుర్తించే పరీక్షలు నిర్వహించి, అవసరమైన చికిత్స విధానాలు అనుసరించి క్యాన్సర్ నుండి కాపాడవచ్చు అని అన్నారు.
రోటరీ మాజీ గవర్నర్ కల్లూరి రామలింగారెడ్డి,నంద్యాల రోటరీ క్లబ్ అధ్యక్షులు వివేకానంద రెడ్డి,ఇన్నర్ వీల్ అధ్యక్షురాలు మల్లీశ్వరి మాట్లాడుతూ అంతర్జాతీయ రోటరీ క్లబ్ తరఫున క్యాన్సర్ పరీక్షలకు ఉపయోగపడే 60 లక్షల రూపాయల విలువ చేసే పరికరాలు ఉదయానంద కార్కినోస్ క్యాన్సర్ ఆసుపత్రి కి అందించామని వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఉదయానంద ఆసుపత్రి వైద్యులు జీర్ణకోశ వ్యాధి నిపుణులు డాక్టర్ భార్గవ రెడ్డి, క్యాన్సర్ శస్త్ర చికిత్స నిపుణులు డాక్టర్ సాయి ప్రణీత్, రేడియేషన్ క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ సుష్మిత, మెడికల్ క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ కుశాల,ఆసుపత్రి డైరెక్టర్ పరమేశ్వర రెడ్డి, మెడికల్ సూపరిండెంట్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, గుండె జబ్బుల నిపుణులు డాక్టర్ రామేశ్వర్ రెడ్డి, స్త్రీ వ్యాధి నిపుణురాలు డాక్టర్ గీతావాణి, శస్త్ర చికిత్స నిపుణులు నాగ సుదర్శన్ రెడ్డి, నంద్యాల ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్, కార్యదర్శి డాక్టర్ మహమ్మద్ రఫీ, మాజీ అధ్యక్షులు డాక్టర్ మధుసూదనరావు, రాష్ట్ర కార్యవర్గ కమిటీ సభ్యులు డాక్టర్ విజయభాస్కర రెడ్డి, డాక్టర్ వసుధ, మహిళా వైద్య విభాగం కార్యదర్శులు డాక్టర్ సునీత, డాక్టర్ శైలజ, సీనియర్ మహిళా వైద్యులు డాక్టర్ నాగమణి, డాక్టర్ నర్మద, రోటరీ క్లబ్ మాజీ గవర్నర్ కల్లూరి రామలింగారెడ్డి,అధ్యక్షులు వివేకానంద రెడ్డి, సీనియర్ సభ్యులు కైలాసనాథరెడ్డి, ప్రసాదరెడ్డి, లక్ష్మీనారాయణ, చిత్తలూరి రామచంద్రయ్య, ఇన్నర్ వీల్ అధ్యక్షురాలు మల్లీశ్వరి, ఇన్నర్ విల్ సభ్యులు సువర్చల, వసుంధర, ఉదయానంద ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
Arattai