NANDYAL :-ఈ నెల 9వ తేదీన డోన్ మండలం కొత్త బురుజు గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన జరగనున్న నేపథ్యంలో నిర్వహించనున్న కార్యక్రమాల ఏర్పాట్లను సమగ్రంగా, ఎలాంటి లోపాలు లేకుండా పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు.

శనివారం కొత్త బురుజు గ్రామంలో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కార్యక్రమం నిర్వహించనున్న ప్రదేశాలు, హెలిప్యాడ్ మైదానం, సభాస్థలి తదితర ప్రాంతాలను ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సునీల్ షొరాణ్, జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్ లతో సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు.

Arattai