NANDYAL Mar18 :- ప్రపంచ నోటి ఆరోగ్య పరిరక్షణ దినోత్సవం సందర్భంగా నంద్యాల టెక్కె మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాలలో ఇండియన్ డెంటల్ అసోసియేషన్ రాయలసీమ బ్రాంచి, నంద్యాల దంత వైద్యుల ఆధ్వర్యంలో ఒక ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ దంత వైద్యులు డా “కె.కిశోర్ కుమార్,డా”వరుణ్ కుమార్,డా”సూర్య ప్రకాష్,డా”సునీల్ జాషువా,డా”జయసింహ తదితరులు పాల్గొన్నారు.విద్యార్థులకు దంత పరీక్షలు జరిపి, దంతధావనం గురించి అవగాహన కల్పించారు.110 మంది విద్యార్థులకు,6 మంది ఉపాధ్యాయులకు పేస్ట్ లు ఉచితంగా పంపిణీ చేశారు.

Arattai