NANDYAL April 23 :- అండర్ 21 బాలికల జాతీయస్థాయి హాకీ పోటీలకు నంద్యాల ప్రభుత్వ కళాశాల విద్యార్థిని భార్గవి ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ విజయలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల నందు అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు రామకృష్ణయ్య,దివాకర్,శ్రీనివాసరెడ్డి, రామమూర్తి, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు,రామకృష్ణ లు పాల్గొని భార్గవిని అభినందించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ విజయలక్ష్మి మాట్లాడుతూ ఇంటర్ HEC ద్వితీయ సంవత్సరం చదువుతున్న భార్గవి,అండర్21 బాలికల జాతీయస్థాయి హాకీ ఛాంపియన్షిప్ పోటీలకు కు ఎంపికైందని తెలిపారు.

త్వరలో పూణేలో జరగబోయే జాతీయ స్థాయి హాకీ పోటీల్లో భార్గవి పాల్గొంటున్నట్లు తెలిపారు.భార్గవి ఆటల్లోనే కాక చదువుల్లో కూడా ఫస్ట్ ఉంటుందని తెలిపారు. కళాశాలలో HEC గ్రూపులో కాలేజ్ టాపర్ గా నిలిచిందని తెలిపారు.ఇప్పటికే ఎన్నో రాష్ట్రస్థాయి, సౌజన్ పోటీలలో పాల్గొని చక్కటి ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎన్నికైనట్లు తెలిపారు ఈ సందర్భంలో హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు చాణక్యరాజు కి, SPG కళాశాల ప్రిన్సిపల్ మరియు హాకీ ఆంధ్ర నంద్యాల జిల్లా జాయింట్ సెక్రెటరీ దివాకర్ మరియు హాకి కోచ్ శ్రావణ్ కుమార్ కు ప్రిన్సిపల్ విజయలక్ష్మి క్రృతజ్ఞతలు తెలిపారు.
Arattai