NANDYAL April 26:-నంద్యాల పట్టణంలోని జిల్లా విశ్వహిందూ పరిషత్ కార్యాలయం నందు గల భగీరథ సదన్ నందు బాలభవన్ నాట్యాలయం వారి ఆధ్యర్యంలో విశ్వ హిందూ పరిషత్ సహకారంతో మే 6 నుండి జూన్ 6వ తేదీ వరకు నెల రోజుల పాటు కూచి పూడి నాట్య శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్టు నాట్య గురువు హేమలత తెలిపారు.

ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ సేవా , విద్యా , ఉపాధి శిక్షణ రంగాలతో పాటు కళా రంగాన్ని కూడా ప్రోత్సహించడంలో భాగంగా కూచి పూడి శిక్షణ తరగతులకు ఉచిత వసతి కల్పించామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు యర్రం విష్ణు వర్ధన్ రెడ్డి , బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ పోలేపల్లి సందీప్ , డా లలితా సరస్వతి , సుహాసిని రెడ్డి , అరుణ , దేవి, నాట్య గురువు హేమలత మరియు తల్లిదండ్రులు , పిల్లలు పాల్గొన్నారు.
Arattai