NANDYAL May08:- వేసవి సెలవులను సృజనాత్మకంగా వినియోగించుకుంటూ నంద్యాల పట్టణానికి చెందిన చిన్నారి నిధీష మట్టి కుండలపై అందమైన రంగులు వేసి ప్రజలను ఆకట్టుకుంది.వేసవి సెలవుల సమయంలో ఇంటి వద్దనే మట్టి కుండలను తీసుకొని వాటిని తన ఊహాశక్తితో వివిధ రంగులతో అలంకరించిన నిధీష్ చేసిన ఈ చిన్ని ప్రయత్నం చుట్టుపక్కల అందరినీ ఆకర్షించింది.

నిధీష చేసిన రంగు బొమ్మలు, డిజైన్లు చూసి పలువురు మెచ్చుకుంటున్నారు.నిధీష తల్లిదండ్రులైన కోటేశ్వర రెడ్డి, మంజూషలు తమ కూతురు సృజనాత్మకతను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.ఈ విషయం తెలిసిన మిత్రులు, బంధువులు, పలువురు చిన్నారుల తల్లిదండ్రులు నిధీష్కు అభినందనలు తెలిపారు.చిన్నారులలో సృజనాత్మకతను ప్రోత్సహించాలని, వేసవి సెలవులను ఇలాంటి ఉపయోగకరమైన కార్యకలాపాలతో వినియోగించుకోవాలని ఈ సందర్భంగా అందరూ సూచిస్తున్నారు
Arattai