NANDYAL May19 :- నంద్యాల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఎస్సి సెల్ ఆధ్వర్యంలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చేత దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్యకు గురైన ఘటనను స్మరించుకుంటూ, ఆయనకు టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి Nmd ఫిరోజ్ మరియు దళిత సంఘ నాయకులు ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా Nmd ఫిరోజ్ మాట్లాడుతూ, జగన్ రెడ్డి పాలనలో దళితులపై దాడులు, హత్యలు అత్యధికంగా జరిగాయని ఆరోపించారు. వైసీపీ నాయకుల చేత వీధి సుబ్రహ్మణ్యం హత్యకు గురై “డోర్ డెలివరీ” చేసిన ఘటన రాష్ట్రాన్ని కలచివేసిందన్నారు. అలాగే కరోనా సమయంలో మాస్క్ అడిగినందుకు డా. సుధాకర్ ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. వీరు కేవలం బాధితులు మాత్రమే కాదని, దళిత అమరులని కొనియాడారు.

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో 200 మందికి పైగా దళితులు హత్యలకు గురయ్యారని, దళితులకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించి దళిత సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు.దళిత మహిళలపై అత్యాచారాలు, అన్యాయాలు పెరిగినా వైసీపీ నాయకత్వం స్పందించలేదని మండిపడ్డారు.
సామాజిక న్యాయం పేరుతో అధికారంలోకి వచ్చి, దళితుల హక్కులను కాలరాశారని విమర్శించారు. దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చి, అదే దళిత సమాజాన్ని అణగదొక్కడం దుర్మార్గమని అన్నారు.దళితులపై దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోలేదని, దళితులకు ఇచ్చిన హామీల అమలులో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో దళిత సంఘ నాయకులు అడ్వకేట్ బాలస్వామి, MHPS బెనర్జీ,లక్ష్మణ్ దండోరా,మాజీ రాష్ట్ర కార్యదర్శి జిల్లెల్ల. శ్రీరాములు, జిల్లా కార్యదర్శి సౌభాగ్య, ఎస్సి సెల్ నాయకులు జయప్రకాశ్, జోసెఫ్, రవి,పావణి,మల్లెల భాస్కర్, నాగేశ్వర రావు, ప్రభాకర్, రాజశేఖర్, సురేష్, సురేష్, సగినాల తిమ్మయ్య, గురు తదితరులు పాల్గొన్నారు. రాజేంద్రకుమార్
నంది న్యూస్ రిపోర్టర్
Arattai