NANDYAL May 27:- నంద్యాల శ్రీనివాస్ నగర్ లోని రామకృష్ణ డిగ్రీ అటానమస్ కళాశాల ఆడిటోరియంలో బుధవారం అకాడమిక్ సనైట్ మీటింగ్ నిర్వహించారు. రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి రాయలసీమ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు కృష్ణారెడ్డి, రామలింగయ్యలు హాజరయ్యారు. అటానమస్ కళాశాలలో అమలు చేస్తున్న విద్యా విధానాలపై ఆరా తీసి వారు సంతృప్తి వ్యక్తం చేశారు.

విద్యా రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అలాగే రానున్న విద్యా సంవత్సరంలో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సర్టిఫికెట్ కోర్సులను పరిచయం చేస్తున్నట్లు పేర్కొన్నారు. సబ్జెక్టుతోపాటు ఇతర రంగాలలో రాణించేందుకు వారిలోని సృజనాత్మకతను గుర్తించేందుకు ఈ కోర్సులు దోహదపడతాయన్నారు. కో కరికులం,ఎక్స్ ట్రా కరికులం ఆక్టివిటీస్ తో విద్యార్థులు సంపూర్ణ వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించేందుకు కళాశాల నిర్వహిస్తున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు.

చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేస్తున్న క్వాంటం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనుగుణంగా విద్యారంగంలో నూతన సంస్కరణలను అమలు చేసే భాగంలో డిగ్రీ,పీజీ విభాగాలలో నూతన కోర్సులను ప్రవేశ పెట్టేందుకు విశ్వవిద్యాలయం నుంచి అనుమతి పొందేందుకు కృషి చేస్తున్నామన్నారు. సమావేశంలో కళాశాల డైరెక్టర్ హేమంత్ రెడ్డి,కళాశాల హెచ్వోడీలు, అధ్యాపక బృందం, పలువురు పాల్గొన్నారు.
రాజేంద్రకుమార్ నంది న్యూస్

Arattai