NANDYAL June05:- జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు వ్యాసరచన చిత్రలేఖన పోటీలను కేఎన్ఎం మున్సిపల్ హైస్కూల్ నందు జిల్లా విద్యాశాఖ అధికారి పి జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించినట్లు ఎన్జీసీ సమన్వయకర్త సిహెచ్ చంద్రశేఖర్ రెడ్డి తెలియజేశారు.

పర్యావరణ పరిరక్షణ, మరియు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనే అంశాలపై నిర్వహించిన పోటీలలో విజయం సాధించిన విద్యార్థులకు శుక్రవారం నంద్యాల జిల్లా ఉప విద్యాశాఖ అధికారి డిటి శంకర్ ప్రసాద్ ముఖ్యఅతిథిగా పాల్గొని మెమెంటోలు మరియు ప్రశంసా పత్రములు అందజేశారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఉప విద్యాశాఖాధికారి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తమ తల్లి తండ్రుల జన్మదినాన్ని పురస్కరించుకొని గుర్తుగా మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. ప్రకృతిలో ఆకుపచ్చని మొక్కలు ఎంతో విలువైన సంపద అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి కే. సుందరరావు సైన్స్ కోఆర్డినేటర్ కెవి సుబ్బారెడ్డి,కార్యక్రమ నిర్వాహకులు సిహెచ్ చంద్రశేఖర్ రెడ్డి జిల్లా దీక్ష కోఆర్డినేటర్ జి నాగేంద్ర కుమార్, న్యాయ నిర్ణేతలు శేషఫణి, శ్రీనివాసరెడ్డి విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు
Arattai