NANDYAL July05 :- జిల్లా ప్రజల సమస్యలను సత్వరంగా పరిష్కరించి, ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత సమర్థవంతంగా అందించాలనే లక్ష్యంతో జూలై 06 తేదీ (సోమవారం) జిల్లా వ్యాప్తంగా “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ కార్యక్రమం జిల్లా కలెక్టరేట్‌తో పాటు అన్ని రెవెన్యూ డివిజన్ కార్యాలయాలు, మండల పరిషత్ కార్యాలయాలు మరియు మున్సిపల్ కార్యాలయాల్లో ఒకేసారి నిర్వహించబడుతుందని తెలిపారు. కార్యక్రమాన్ని ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన వినతిపత్రాలను నేరుగా అధికారులకు సమర్పించవచ్చని, అలాగే meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో కూడా ఫిర్యాదులు నమోదు చేసుకునే అవకాశం కల్పించబడిందని తెలిపారు. సమర్పించిన అర్జీల పరిష్కార స్థితిని అదే వెబ్సైట్లో లేదా టోల్ ఫ్రీ నంబర్ 1100 ద్వారా తెలుసుకోవచ్చన్నారు.అర్జీదారులు తమ సమస్యలకు సంబంధించిన వినతులను ముందుగా మండల, డివిజన్ లేదా మున్సిపల్ స్థాయి కార్యాలయాల్లో సమర్పించి, అక్కడ పరిష్కారం కాని అంశాలను మాత్రమే జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు.జిల్లా కేంద్రంలో ఉదయం 9:30 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరై ప్రజల వినతులను స్వీకరించి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.
Arattai