NANDYAL July 08:- హెచ్ఆర్ఎంఎస్ (HRMS) ఈ-పాస్ విధానాన్ని రద్దు చేసి,గతంలో అమలులో ఉన్న మాన్యువల్ విధానంలోనే రైల్వే పాసులు జారీ చేయాలని కోరుతూ రిటైర్డ్ రైల్వే ఉద్యోగులు బుధవారం నంద్యాల ADEN కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.

అనంతరం ADEN కార్యాలయ ఉన్నతాధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్స్ అసోసియేషన్ జోనల్ ప్రెసిడెంట్ చాంద్బాషా జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, రంగస్వామి, నంద్యాల బ్రాంచి నాయకులు అన్వర్ కృష్ణమూర్తి చంద్రశేఖరాచారి రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, హెచ్ఆర్ఎంఎస్ ఈ-పాస్ విధానం కారణంగా వృద్ధులు, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నందున పాస్లు పొందడం కష్టంగా మారిందన్నారు.అందువల్ల కేంద్ర ప్రభుత్వం, రైల్వే శాఖ వెంటనే హెచ్ఆర్ఎంఎస్ ఈ-పాస్ విధానాన్ని రద్దు చేసి, మునుపటిలాగే మాన్యువల్ విధానంలో రైల్వే పాసులు జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.
Arattai