బడికి దూరంగా ఉన్న పిల్లలకు కౌన్సిలింగ్
NANDYAL Aug11 :- నంద్యాల పట్టణంలో బడికి వెళ్లకుండా బయట తిరుగుతున్న పిల్లలను గుర్తించి, వారిని తిరిగి పాఠశాలల్లో చేర్పించేందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా మంగళవారం పాఠశాలల సమన్వయకర్త యం.డి. ప్రసన్నకుమార్, జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బడికి దూరంగా ఉన్న పిల్లలకు, వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు.
పిల్లలను బడికి పంపకుండా బయట ఉంచడం వల్ల వారి భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం పడుతుందని తల్లిదండ్రులకు అధికారులు వివరించారు.

ప్రతి చిన్నారి విద్యను అభ్యసించేలా తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. పిల్లల ఆసక్తులు, పరిస్థితులను తెలుసుకుని వారికి అనుకూలమైన విద్యా అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.బడికి దూరమైన పిల్లలను గుర్తించి, వారిని తిరిగి విద్యావ్యవస్థలోకి తీసుకురావడమే లక్ష్యంగా అధికారులు క్షేత్రస్థాయిలో కౌన్సిలింగ్ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.
Arattai