గుంతకల్లు–గుంటూరు రైల్వే డబ్లింగ్,విద్యుదీకరణ పనులను వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
NANDYAL Aug29 :- గుంతకల్లు–గుంటూరు రైల్వే మార్గంలో చేపడుతున్న డబ్లింగ్ మరియు విద్యుదీకరణ పనులకు సంబంధించి భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసి, పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ రాజ కుమారి గణియా తెలిపారు.

శనివారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి గుంతకల్లు–గుంటూరు రైల్వే మార్గంలో చేపడుతున్న డబ్లింగ్ పై గుంతకల్ కన్స్ట్రక్షన్స్ Dy.CE సంతోష్ కుమార్, SSE works గుంతకల్ కన్స్ట్రక్షన్స్ ఆనంద్ కుమార్, AXEN / కన్స్ట్రక్షన్స్ Dhone భగవాన్ దాస్ సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి సుమారు 2 ఎకరాల 32 సెంట్ల భూమికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియ పురోగతిలో ఉందని తెలిపారు. గతంలో కోర్టు పరిధిలో ఉన్న కేసులకు సంబంధించి సంబంధిత అధికారులతో కలిసి ఇటీవల క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగిందన్నారు. భూసేకరణకు సంబంధించిన అంశాలను వేగంగా పరిష్కరించి, రైల్వే డబ్లింగ్ మరియు విద్యుదీకరణ పనులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

రైల్వే ప్రాజెక్టు పూర్తయితే ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు మరింత సులభతరం కావడంతో పాటు ప్రయాణికులు, సరుకు రవాణాకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై సంబంధిత శాఖలు, రైల్వే అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ అవసరమైన చర్యలు చేపడతామన్నారు.
Arattai