నంద్యాల పట్టణంలో సెప్టెంబర్ 5న శ్రీరామకృష్ణ విద్యాలయం పూర్వ విద్యార్థుల మహా సమ్మేళనం
NANDYAL Aug30 :- నంద్యాల పట్టణంలోని శ్రీరామకృష్ణ విద్యాలయం గోల్డెన్ మరియు ప్లాటినం జూబ్లీ వేడుకలను నిర్వహించనున్నట్లు పాఠశాల పూర్వ విద్యార్థుల నిర్వహక కమిటీ వెల్లడించింది. సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుల దినోత్సవ రోజుల పాఠశాల ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమంతో పాటు పలు కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ప్రకటించింది.పాఠశాలను 1956వ సంవత్సరంలో పెద్దలు నివర్తి వెంకటసుబ్బయ్య స్థాపించిన ప్రాధమిక పాఠశాల ప్లాటినం జూబ్లీ, 1974వ సంవత్సరంలో ఉన్నత పాఠశాల ప్రారంభం అయి నేటికి గోల్డెన్ జూబ్లిని పూర్తి చేసుకుంది. గోల్డెన్, ప్లాటినం జూబ్లీలను పురస్కరించుకొని గురుపూజోత్సవం రోజున 70 సంవత్సరాల విద్యార్థులను ఒకే వేదికపై తీసుకొని వచ్చేందుకు మహాసమ్మేళనం పేరుతో వేడుకలను నిర్వహించనున్నట్లు కమిటీ ప్రతినిధిలు వెల్లడించారు. పాఠశాలలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో పూర్వ విద్యార్థులు డా.రవికృష్ణ, శివకుమార్ రెడ్డి, రవిప్రకాష్, చలంబాబు, శ్రీధర్, వరదా మురళీ విజయభాస్కర్, మధుబాబు, ప్రధానోపాధ్యాయుడు తిరుమలరావు, రాజేంద్రప్రసాద్ లు మాట్లాడారు. ఒకే పాఠశాలలో చదివిన విద్యార్ధులకు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేయనున్నామన్నారు. పద్మావతినగర్ లోని
స్టేడియం నుంచి ఉపాధ్యాయులను పాఠశాల ప్రాంగణానికి పూర్వ విద్యార్థులే ప్రత్యేక వాహనంలో అపూర్వమైన ఆత్మీయ ఊరేగింపుగా తీసుకొని వస్తామన్నారు. విద్యాలయంలో పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి చిన్ననాటి ప్రార్ధనా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రమథ నందిశ్వరస్వామి దేవాలయ కల్యాణ మండపంలో మహాసమ్మేళనాన్ని ఏర్పాటు చేశామన్నారు.పాఠశాలలో విద్యను అభ్యసించిన వేలాది మంది జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో స్థిరపడ్డారని గుర్తు చేశారు. ఎందరో విద్యార్థులు వివిధ రంగాల్లో ఉన్నత స్ధాయిలో ఉన్నారన్నారు. తమకు విద్యాబుద్ధులను నేర్పించిన గురువుల సేవలను గుర్తు చేసుకుంటూ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు.మహాసమ్మేళనానికి ప్రతి పూర్వ విదార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు.ప్రతి సంవత్సరం విద్యార్ధులు ఇందుకు సంబంధించి పూర్వ విద్యార్థులకు మహాసమ్మేళనం వివరాలను తెలియ జేయడం జరిగిందన్నారు. మన పాఠశాల మన కుటుంబం ఒకే వేదిక…మళ్లీ మన బడికి మళ్లీ మన బాల్యానికి…. వెయ్యి హృదయాలు.. లక్ష జ్ఞాపకాలు మహా సమ్మేళనం నినాదం అన్నారు. మనకు దూరమైన పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులను మహా సమ్మేళనంలో గుర్తు చేసుకోనున్నట్లు తెలిపారు. పాఠశాల ప్రతి బ్యాచ్ నుంచి ఇద్దరు చొప్పున మహా సమ్మేళనానికి స్వచ్చంగా ముందుకు వచ్చి నిర్వహక కమిటీకి తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. చిరస్థాయిగా నిలిచి పోయేలా నిర్వహించనున్న గోల్డెన్, ప్లాటినం జూబ్లీ వేడుకల విజయవంతానికి అందరి భాగస్వామ్యం ఎంతో అవసరమని కోరారు.ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మహాసమ్మేళనం- 2026 పోస్టర్ ను విద్యార్థులు విడుదల చేశారు.
Arattai