నంద్యాల లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ
NANDYAL Sep12 :- నంద్యాల పట్టణంలో నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాలను ప్రజలకు అందజేసినట్లు లయన్స్ క్లబ్ సభ్యులు తెలిపారు.

మట్టి వినాయక విగ్రహాలను వినియోగించడం ద్వారా పర్యావరణానికి హాని కలగకుండా పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవచ్చని తెలిపారు.ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను ఉపయోగించి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించాలన్నారు.

ఈ కార్యక్రమంలో నంద్యాల లైన్స్ క్లబ్ అధ్యక్షులు సందీప్ సెక్రటరీ మేడా చంద్రశేఖర్ క్లబ్ సభ్యులు గోళ్ళ సుదర్శనం ఎంపీ వి రమణయ్య పోసిన సుబ్బారావు నాగరాజు సుధాకర్ రెడ్డి జనార్ధన్ చంద్రమోహన్ రామయ్య తదితరులు పాల్గొన్నారు
Arattai