ఇంటాక్ నంద్యాల చాప్టర్ ఆధ్వర్యంలో కళలు, సంస్కృతి చారిత్రక కట్టడాల పరిరక్షణ తదితర అంశాలపై ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న రెండు రోజుల శిక్షణ సదస్సు సోమవారం గురు రాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో ప్రారంభమైంది.ఇంటాక్ సంస్థ నంద్యాల చాప్టర్ అధ్యక్షులు శివకుమార్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన ఈ సదస్సుకు జిల్లా విద్యాశాఖాధికారి జనార్ధన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

జిల్లా విద్యాశాఖాధికారి జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ భారతీయ కళలు సంస్కృతి వారసత్వ సంపద చాలా గొప్పవని వాటి వైభవాన్ని భావితరాలకు అందించాల్సిన అవసరం ఉపాధ్యాయులకు ఉందన్నారు. ఈ సందర్భంగా అహోబిలం సాంస్కృతిక వైభవం, పారువేట విశేషాలు తెలిపే పోస్టర్ ను విడుదల చేశారు.ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా వచ్చిన ఇద్దరు శిక్షకులు అభిషేక్, దీపాన్ష్ సాంస్కృతిక మరియు ప్రాకృతిక వారసత్వ సంపదకు సంబంధించిన పలు విషయాలపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు.

కార్యక్రమంలో శివ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాల ఆధ్యాత్మిక, సాంస్కృతిక, చారిత్రక నేపథ్యం గల జిల్లా అని ఉపాధ్యాయులు భావితరాలకు మన ఘన చరిత్రను గురించి అవగాహన కల్పించాలన్నారు . కార్యక్రమంలో ఇంటాక్ నంద్యాల చాప్టర్ అడిషనల్ కో కన్వీనర్ సేతురామన్ గురురాజా స్కూల్ డైరెక్టర్ షావలి రెడ్డి, రోటరీ స్కూల్ కరస్పాండెంట్ డివి సుబ్బయ్య, రామయ్య , ప్రభుత్వ ,ప్రైవేటు పాఠశాలకు సంబంధించిన,సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.నంద్యాల జిల్లా విశిష్టత గురించి ప్రత్యేకతల గురించి వారసత్వ సంపద గురించి నేటి తరానికి ముఖ్యంగా విద్యార్థులకు తెలియపరచడం కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Arattai