ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన విజయవంతం కావడంపై మంత్రులు,అధికారులను అభినందించిన CM చంద్రబాబు

NANDI NEWS October 17:- ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన విజయవంతం కావడంపై మంత్రులు, వివిధ శాఖల అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రధాని ఏపీలో నాలుగోసారి జరిపిన పర్యటనలో కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారని… వీటిల్లో కర్నూలులో నిర్వహించిన సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ అయ్యిందని సీఎం అన్నారు.

ఈ సభ మంచి మెసేజ్ ఇచ్చిందని సీఎం అన్నారు. అన్ని శాఖల అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేశారని ముఖ్యమంత్రి అన్నారు. ప్రధాని సైతం పర్యటనను ఎంతో ఆస్వాదించారని సీఎం తెలిపారు.శ్రీశైలం మల్లన్న ఆలయం దర్శనంపై ప్రధాని ఎంతో సంతృప్తిని, సంతోషాన్ని వ్యక్తం చేశారని సీఎం వివరించారు.

విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోండి: మంత్రి సవిత

ప్రధాని మోదీ సైతం సూపర్ జీఎస్టీ కార్యక్రమాలను అభినందించారని సీఎం చెప్పారు. జీఎస్టీ నెల రోజుల పాటు చేసిన కార్యక్రమాలపై సమగ్రంగా ఒక పుస్తకాన్ని ప్రచురించాలని సీఎం అధికారులను ఆదేశించారు.

నంద్యాల అనస్థీషియా వైద్యుల శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ అనస్థీషియా దినోత్సవం

I’m Vasu, a journalist with 20 years of experience, now bringing you news through Nandi News.