నంద్యాల-ఉద్యోగుల డిమాండ్లపై సీ.ఎం చంద్ర బాబు స్పందన హర్షణీయం —నంద్యాల ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్

నంద్యాల- దీపావళి కానుకగా నవంబర్ నెల నుంచి ఒక డిఏను విడుదల చేయడం, 60 రోజుల్లో హెల్త్ కార్డుల వ్యవస్థను సక్రమంగా నడిపించేందుకు కమిటీని ఏర్పాటు చేసి ఇన్సూరెన్స్ విధానాన్ని పరిశీలించాలని ఆదేశించడం, ఆర్‌టీసీ ఉద్యోగుల ప్రమోషన్‌లపై వారం రోజుల్లో ఉత్తర్వులు జారీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం పండుగకు ముందే ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించడం, ముఖ్యమంత్రితో మరియు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌తో జరిగిన స్నేహపూర్వకమైన, గౌరవప్రదమైన, హుందాతన చర్చలు — దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత ఈ స్థాయిలో జరగడం — సంతోషదాయకమని వారు పేర్కొన్నారు.

చైల్డ్ కేర్ లీవ్‌పై ముఖ్యమంత్రి చేసిన ప్రకటన మహిళా ఉద్యోగుల్లో ఆనందాన్ని నింపిందని తెలిపారు.
హెల్త్ కార్డుల విషయంలో ప్యాకేజీ రేట్లు పెంచడం, జిల్లా ఆస్పత్రుల్లో చికిత్స పరిమితిని ₹50,000 నుండి ₹1,00,000కి పెంచడం, ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ నేరుగా ట్రస్ట్ ఖాతాలో జమయ్యేలా చూడటం, వైద్య సేవల సీలింగ్‌ను ₹2 లక్షల నుండి ₹5 లక్షల పైబడేలా పెంచడం, అలాగే ఆరోగ్యశ్రీ (EHS) విధానాన్ని ఇన్సూరెన్స్ మోడల్‌గా మార్చే అవకాశాలను పరిశీలించాలని కమిటీకి ఆదేశించడం — ఇవన్నీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ముఖ్యంగా పెన్షనర్లలో ఆనందాన్ని కలిగించే నిర్ణయాలుగా పేర్కొన్నారు

AP-ఈనెల 22 నుండి ప్రధమనందీశ్వర స్వామి దేవస్థానం నందు అన్న ప్రసాద వితరణ

ఉద్యోగ సంఘాలు, ఎన్‌జీవో హోమ్‌లను గతంలో మాదిరిగానే ప్రాపర్టీ టాక్స్ నుంచి మినహాయించడం, అలాగే చెల్లించవలసిన బకాయిలను రద్దు చేయడం కూడా హర్షణీయమని తెలిపారు.

దీపావళికి ముందే ఉద్యోగ సంఘాల డిమాండ్లపై ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేయాలని పట్టుబట్టి, ఆ సమావేశాన్ని సాధించగలిగిన ఏపీ జేఏసీ అధ్యక్షులు శ్రీ విద్యాసాగర్ మరియు ప్రధాన కార్యదర్శి శ్రీ డి.వి. రమణ మరియు అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీ వి. దస్తగిరి రెడ్డి మరియు కార్య వర్గ సబ్యులకు మా ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ నంద్యాల తరుపున అభినందనలు తెలియచేస్తున్నాం అని నంద్యాల ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు హుస్సేన్ రెడ్డి,నరసా రెడ్డి తెలిపారు.

AP-నంద్యాలజిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయం నందు దీపావళి వేడుకలు

I’m Vasu, a journalist with 20 years of experience, now bringing you news through Nandi News.