AP-ప్రతి విద్యార్థి తప్పక అపార్ ఐడి కలిగి ఉండాలి: జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

నంద్యాల, అక్టోబర్ 22:- జిల్లాలో పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల అపార్ ఐడి (Automated Permanent Academic Account Registry) నమోదు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి జి. రాజకుమారి సంబంధిత విద్యా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని ఎన్ఐసి వీడియో కాన్ఫరెన్స్ హాల్‌ నుండి అపార్ ఐడి పురోగతిపై క్లస్టర్ హెచ్ఎంలు, ఎంఈఓలు, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్స్‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ, “అంగన్వాడీ స్థాయి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న ప్రతి విద్యార్థి తప్పనిసరిగా అపార్ ఐడి కలిగి ఉండాలన్నారు. ఆధార్ కార్డు ప్రతి పౌరుడికి అవసరమైనట్లు, విద్యార్థులకు అపార్ ఐడి కూడా అంతే ముఖ్యమైనదని పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 85 శాతం విద్యార్థులకు అపార్ ఐడి జనరేషన్ పూర్తయిందని, మిగిలిన 15 శాతం విద్యార్థుల ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు.

శ్రీశైలంలో అభిషేకాలు రద్దు,విడతల వారీగా మల్లన్న స్పర్శ దర్శనం

అపార్ ఐడి ద్వారా విద్యార్థులకు స్కాలర్షిప్స్, ప్రభుత్వ ప్రయోజనాలు, వివిధ విద్యా పథకాలు సులభంగా అందుతాయన్నారు. కొంతమంది విద్యార్థుల ఆధార్ కార్డుల్లో పేర్లు లేదా వివరాల్లో పొరపాట్లు ఉండటం వల్ల అపార్ ఐడి జనరేషన్ ఆలస్యమవుతోందని గుర్తించిన కలెక్టర్, “ఆధార్ కార్డులో ఉన్న తప్పులను తక్షణమే సరిచేసి ప్రతి విద్యార్థికి అపార్ ఐడి లభించేలా చర్యలు తీసుకోవాలి,” అని అధికారులను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా విద్యా అధికారి జనార్ధన్ రెడ్డి, సంబంధిత విభాగాల అధికారులు పాల్గొన్నారు

AP-రాష్ట్రంలో కొత్తగా ఏడు డయాలసిస్ కేంద్రాలు: మంత్రి సత్యకుమార్

📖 Also Available as Web Story

Experience this content as an engaging Web Story - perfect for mobile reading!

🎬 View Web Story
I’m Vasu, a journalist with 20 years of experience, now bringing you news through Nandi News.