భారత హాకీ చరిత్ర -పద్మభూషణ్ ధ్యాన్ చంద్ ప్రాముఖ్యత అంశంపై
4 వ తేది తెలుగులో వ్యాసరచన పోటీలు.
6 వ తేదీన ఆంగ్లంలో వక్తృత్వ పోటీలు.
పోటీల వేదిక: రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియం
భారత జాతీయ హాకీ శతాబ్ది ఉత్సవాలు పురస్కరించుకుని, నంద్యాల హాకీ సంఘం ఆధ్వర్యంలో, నంద్యాల లయన్స్ క్లబ్ సహకారంతో నంద్యాల ప్రాంత హైస్కూల్ విద్యార్థులకు “భారత హాకీ చరిత్ర – హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ ప్రాముఖ్యత ” అంశంపై 4 వ తేదీ తెలుగులో వ్యాసరచన పోటీలు,6 వ తేదీ అదే అంశంపై ఆంగ్లంలో వక్తృత్వ పోటీలు స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో ఉదయం 10 గంటలకు నిర్వహించడం జరుగుతుందని పోటీల నిర్వాహకులు, లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ డాక్టర్ రవికృష్ణ,హాకీ ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షులు చాణక్య రాజు ఒక ప్రకటనలో తెలిపారు.

ఆసక్తిగల విద్యార్థులు పోటీలు జరిగే సమయంలో నేరుగా వచ్చి పాల్గొనవచ్చు అన్నారు.
రెండు విభాగాలలో ప్రధమ, ద్వితీయ,తృతీయ బహుమతులతో పాటు రెండు స్పెషల్ జ్యూరీ బహుమతులను ఎంపిక చేసి,నవంబర్ 7వ తేదీ ఎస్పీజీ స్కూల్ మైదానంలో జరిగే భారత హాకీ శతాబ్ది ఉత్సవంలో, నంద్యాల లయన్స్ క్లబ్ వ్యవస్థాపక సభ్యులు,పారిశ్రామికవేత్త ఆత్మకూరు సుదర్శనం శెట్టి సౌజన్యంతో విజేతలకు బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుందన్నారు.

Arattai