నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆరోగ్యం- పరిశుభ్రత ప్రిన్సిపాల్ శశికళ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.విద్యార్థులకు ఆరోగ్యం – పరిశుభ్రత ,కౌమార యవ్వనంలో వచ్చేటటువంటి హార్మోనల్ మార్పులు మరియు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించినట్లు వారు తెలిపారు.మహిళలకు సాధారణంగా వచ్చేటటువంటి ఋతు క్రమ సంబంధిత ఇబ్బందులు మరియు శానిటరీ నాప్కిన్స్ వినియోగం గురించి వివరించారు.

ఈ కార్యక్రమానికి మహిళా అధ్యాపకులు అయిన ఎస్ పార్వతి, డాక్టర్. వెంకట లక్ష్మమ్మ, కుసుమ కుమారి పాల్గొని వారి అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేశారు. ఈ కార్యక్రమానికి 132 మంది విద్యార్థినులు హాజరయ్యారు. వీరందరూ శానిటరీ నాప్కిన్స్ ను కళాశాల ప్రిన్సిపల్ చేత అందుకుని లబ్ధి పొందడం జరిగింది.
Arattai