వైకుంఠ ద్వార దర్శనాలపై నిర్ణయం
తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం మంగళవారం జరుగనుంది. తిరుమలలోని అన్నమయ్య భవనంలో బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ప్రధానంగా వైకుంఠ ద్వార దర్శనాలపై నిర్ణయం తీసుకోనున్నారు. టోకెన్లు, టికెట్లు కేటాయింపు, భక్తులకు ఏర్పాట్లు, దర్శన సమయాల పెంపు అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నారు.
డిసెంబర్ 30 నుండి పది రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనాలు: టిటిడి బోర్డు సమావేశంలో కీలక నిర్ణయం
వైకుంఠ ఏకాదశిపై తితిదే కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 30 నుంచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నట్లు తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.
మొత్తం 182 గంటల దర్శన సమయంలో 164 గంటలు సామాన్య భక్తులకే కేటాయిస్తామని తెలిపారు.
మొదటి మూడు రోజులు రూ.300, శ్రీవాణి దర్శనాలు రద్దని తెలిపారు.
జనవరి 2 నుంచి 8 వరకు రోజుకు 15 వేల రూ.300 దర్శన టిక్కెట్లు, 1000 శ్రీవాణి దర్శన టికెట్లు రెగ్యులర్ పద్ధతిలో కేటాయిస్తునట్లు తెలిపారు.
Arattai