ఢిల్లీ పర్యటనలో ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కమిషనర్ డా. రజనీష్ తో సమావేశం అయిన మంత్రి కొండపల్లి
రాష్ట్రంలో నడుస్తున్న ఎంఎస్ఎంఈ ముఖ్యమైన ప్రాజెక్టుల గురించి చర్చించిన మంత్రి.
18 నవంబర్ 2025: న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు జరుగుతున్న ఎంఎస్ఎంఈ ముఖ్యమైన ప్రాజెక్టుల పురోగతి, భవిష్యత్తులో చేపట్టాల్సిన ప్రాజెక్టుల గురించి రాష్ట్ర ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఢిల్లీలో మంగళవారం కేంద్ర సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ అదనపు కార్యదర్శి మరియు అభివృద్ధి కమిషనర్ డా. రజనీష్ ను కోరారు.
రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా సోమవారం ఢిల్లీ చేరుకున్న రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం వివిధ కార్యక్రమాలతో పాల్గొన్న విషయం విదితమే. మంగళవారం ఉదయం కేంద్ర ఎంఎస్ఎంఈ అదనపు కార్యదర్శితో సమావేశమైన ఆయన ఎంఎస్ఎంఈ శాఖ ద్వారా రాష్ట్రంలో అభివృద్ధికి ఉన్న అవకాశాలు, ఎంఎస్ఎంఈ లను మరింతగా బలపలోపేతం చేసేందుకు అవసరమైన ఎకోసిస్టంను బలపరిచేందుకు ఉన్న భౌగోళిక స్థితిగతులు, అవకాశాల గురించి చర్చించారు.

రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ క్లస్టర్ల ఏర్పాటుకు కావలసిన మౌళిక సదుపాయాలు, వాటి అభివృద్ధికి ఉన్న అవకాశాల గురించి డా. రజనీష్ దృష్టికి తీసుకెళ్లారు. పెద్ద ఎత్తున చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మంత్రి ఆయనకు వివరించారు.
రాష్ట్రంలో చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌళిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని అందించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈ సందర్భంగా కోరారు.
Arattai