రాజ్ భవన్లో జరిగిన 76వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్.
VIJAYAWADA Nov 26: రాజ్ భవన్లోని దర్బార్ హాల్లో బుధవారం జరిగిన 76వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ ఎస్. అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన సందర్భంగా మాత్రమే కాకుండా, దేశ పౌరులలో రాజ్యాంగ విలువలను ప్రోత్సహించడానికి కూడా రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ తన ప్రసంగలో అన్నారు.

భారత రాజ్యాంగంలో పొందుపరచబడిన ప్రాథమిక హక్కులు మరియు స్వేచ్ఛలను పరిరక్షించడంలోనూ, సమ సమాజానికి నిర్మాణానికి, వ్యక్తిగత హక్కుల పరిరక్షించడంలోనూ రాజ్యాంగం కీలక పాత్ర పోషిస్తుందని గవర్నర్ అన్నారు.

భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కులకు ప్రత్యేక పాత్రను ఇచ్చినప్పటికీ, హక్కులు మరియు విధులు నాణేనికి రెండు వైపులా ఉంటాయని, ప్రజలకు సంక్రమించిన హక్కులతో పాటు సంబంధిత విధులు కూడా ఉంటాయని గమనించాలని గవర్నర్ అన్నారు.

ముందుగా, గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ భారత రాజ్యాంగ ప్రధాన శిల్పి భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ మరియు రాజ్యాంగ ముసాయిదా కమిటీ సభ్యులకు పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. తర్వాత రాజ్యాంగం ప్రియంబల్ ను సమావేశానికి హాజరయిన అతిథులతో గవర్నర్ చదివించారు.

ప్రథమ మహిళ శ్రీమతి సమీరా నజీర్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయ అధికారులు, వివిధ చట్టబద్ధ సంస్థల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి శ్రీ కె. విజయానంద్, గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ జి. అనంత రాము మరియు ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
Arattai